: నటుడు ఉదయ్ కిరణ్ మరణం వెనకున్న మిస్టరీ వీడింది
సినీనటుడు ఉదయ్ కిరణ్ మరణం మిస్టరీ వీడింది. ఊపిరాడకే ఉదయ్ చనిపోయారని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వెల్లడయింది. చనిపోయే ముందు ఉదయ్ మద్యం సేవించారని ఎఫ్ఎస్ఎల్ అధికారి తెలిపారు. సూసైడ్ కి ముందు ఉదయ్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యారని చెప్పారు. ఈరోజు (బుధవారం) తమ రిపోర్టును బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు అందజేశారు. జనవరి 5న ఉదయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉరి వేసుకుని చనిపోయిన ఉదయ్ కిరణ్ మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ రిపోర్టుతో ఉదయ్ సూసైడ్ చేసుకున్నట్టు తేలిపోయింది. రిపోర్టు సహాయంతో ఈ కేసును త్వరలోనే క్లోజ్ చేస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.