: ‘సెరెబ్రల్ మలేరియా’ ఒకరి ప్రాణం తీసింది
‘సెరెబ్రల్ మలేరియా’ ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిని పొట్టన పెట్టుకుంది. ఈ వ్యాధి బారిన పడి వాంకిడి మండలంలోని చిచ్ పల్లి గ్రామ వాసి రావూజీ (40) మంగళవారం రాత్రి మరణించాడు. రావూజీ వారం రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. తొలుత స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లామని, తగ్గకపోవడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని వారు చెప్పారు. అక్కడ కూడా వ్యాధి తగ్గకపోవడంతో డాక్టర్లు కరీంనగర్ కు తీసుకెళ్లమని చెప్పారన్నారు. దాంతో మంగళవారం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామని, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.