: అసోం-నాగాలాండ్ సరిహద్దు హింసాకాండపై నివేదిక కోరిన మోడీ
ఈశాన్య రాష్ట్రాలు అసోం-నాగాలాండ్ సరిహద్దులో చోటుచేసుకుంటున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను నివేదిక సమర్పించాలని కోరారు. గతవారం జరిగిన కాల్పుల్లో దాదాపు పదిహేను మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రేపు (గురువారం) అసోంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది అసోం-నాగాలాండ్ మధ్య వివాదమని, కూర్చొని పరిష్కరించుకోవాలనీ అన్నారు. మరోవైపు ఈ విషయంలో సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించడంలేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు.