: మయన్మార్ లో ఎబోలా కేసు గుర్తింపు
ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న ప్రాణాంతకమైన ఎబోలా పలు దేశాల్లో క్రమక్రమంగా వ్యాపిస్తోంది. తాజాగా మయన్మార్ లో ఎబోలా వైరస్ సోకిన ఓ కేసును గుర్తించినట్లు సమాచార శాఖ తెలిపింది. యాంగోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల స్క్రీనింగ్ లో ఇరవై రెండేళ్ల ఓ వ్యక్తికి వ్యాధి ఉన్నట్లు కనుగొన్నామని జిన్హువా వార్తా సంస్థ వెబ్ సైట్ లో వార్తా కథనంలో వివరించింది. బ్యాంకాక్ నుంచి వస్తున్న అతను తీవ్ర జ్వరంతో ఉన్నాడని, వెంటనే విడిగా ఉన్న వార్డుకు పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.