: ఇది జీరో బేస్డ్ బడ్జెట్... కేంద్రం నిధులనే బడ్జెట్ లో చూపాం: చంద్రబాబు


తాము ప్రవేశపెట్టింది జీరో బేస్డ్ బడ్జెట్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులనే తాము బడ్జెట్ లో చూపామని ఆయన అన్నారు. ఏపీకి వచ్చే కొత్త ఆదాయంపై వచ్చే ఏడాది వరకు స్పష్టత రాదని అన్నారు. బడ్జెట్... అసెంబ్లీలో చెప్పినట్టే ఉండదని... మార్పులు, చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కావల్సిన నిధులను కేంద్రమే సమకూరుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులకు బడ్జెట్ పై ఏమాత్రం అవగాహన లేదని... వారికి దోచుకోవడం తప్ప మరేమీ తెలియదని పరోక్షంగా జగన్ ను విమర్శించారు.

  • Loading...

More Telugu News