: లక్షాయాభై వేల రూపాయల వరకు రుణమాఫీ, అందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి
రైతులు తీసుకున్న పంటరుణాలు, బంగారం రుణాలపై... ఒక కుటుంబానికి లక్షాయాభై వేల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో యనమల ప్రకటించారు. అలాగే స్వయం సహాయక గ్రూపులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. అయితే, రుణమాఫీ జరగాలంటే రైతులు, స్వయం సహాయక గ్రూపులు కచ్చితంగా ఆధార్ కార్డ్ పొంది ఉండాలని ఆయన ప్రకటించారు.