: ఓటమికి సోనియా, రాహుల్ లను బాధ్యులు చేయాలి: శివసేన


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి వారిద్దరినీ కారకులుగా పేర్కొనాలని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధినేత్రి ముందు నిజం మాట్లాడే దమ్ము, ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో విమర్శించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఏమాత్రం బాధ్యుడు కాదంటూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ చెప్పడంపై శివసేన ప్రశ్నించింది. ఇలాంటి అబద్ధం చెప్పేందుకు ఆంటోనీ వంటి నిజాయతీపరుడైన నాయకుడిని కాంగ్రెస్ ఎంచుకుందని, ఆయనకున్న ఇమేజ్ తో శుద్ధ అబద్ధాన్ని చెప్పించిందని ఉద్ధవ్ విమర్శించారు. ఇలా కాంగ్రెస్ తీరుపై 'సామ్నా' సంపాదకీయంలో శివసేన తీవ్రంగా విరుచుకుపడింది.

  • Loading...

More Telugu News