: ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ట్రిపుల్ ఐటీలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు రాబోతున్నాయని మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వాటిని చిత్తూరు, కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూజివీడు, కడపలో ట్రిపుల్ ఐటీలున్నాయి. ఎక్కువమంది విద్యార్థులు వీటిపై మక్కువ చూపుతుండడంతో అదనంగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News