: నా లైఫ్ సినిమాలతో ముడిపడిపోయింది, ఆమె ఓ పాత నేస్తం మాత్రమే: రణ్ బీర్ కపూర్
నిన్నమొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రేమ యాత్రలు చేపట్టి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్న రణ్ బీర్ కపూర్, కత్రీనా కైఫ్ ఏ క్షణమైనా పెళ్ళి చేసుకోవచ్చని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కపూర్ హీరో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నాడు. కత్రీనా ఓ పాత స్నేహితురాలు మాత్రమేనంటున్నాడీ చాక్లెట్ బోయ్. సినిమాలతో తన జీవితం ముడిపడిపోయిందని, ఈ ఏడాది గానీ, వచ్చే ఏడాది గానీ పెళ్ళి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. ఇటీవలే తాను లండన్ లో కత్రీనా తల్లిని కలిసినట్టు వచ్చిన వార్తలను రణ్ బీర్ ఖండించాడు. కత్రీనా తనకు చాలా ఏళ్ళుగా తెలుసని, ఆమె తల్లిని కలిశాననడం వట్టి పుకారేనని పేర్కొన్నాడు.