: భారత్ చర్చలు విరమించుకోవడం 'పిల్ల చేష్టలు' అంటున్న జిలానీ


పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శితో భారత్ చర్చలు విరమించుకోవడాన్ని హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా జిలానీ ఖండించారు. తీవ్ర నిరసనల మధ్య భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ను న్యూఢిల్లీలో కలసిన అనంతరం మాట్లాడుతూ, భారత్ స్పందన చిన్నపిల్లల మాదిరిగా ఉందని, ఈ నిర్ణయానికి అంత ప్రాధాన్యత ఉండదని అన్నారు. చర్చల కోసం తాము పాక్ రాయబార కార్యాలయానికి ప్రతిసారి వస్తామన్న జిలానీ, విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు చేసుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.

  • Loading...

More Telugu News