: పెళ్లయిన కుమార్తె కూడా తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: బాంబే హైకోర్టు


కుమార్తెకు వివాహమైనప్పటికీ తల్లిదండ్రుల కుటుంబంలో ఆమె భాగమేనంటూ బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన తల్లిదండ్రుల కుటుంబంలో ఆమె భాగం కాదని చెప్పలేమని పేర్కొంది. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఓ వివాహిత కుమార్తెపై వివక్ష చూపడం, తల్లిదండ్రుల కుటుంబం నుంచి ఆమెను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని జస్టిస్ అభయ్ ఒకా, ఏఎస్ చందుర్ కర్ నేతృత్వంలోని డివిజన్ స్పష్టం చేసింది. మరణించిన తల్లికి సంబంధించిన కిరోసిన్ రిటైల్ లైసెన్స్ ను పెళ్లయిన ఓ కుమార్తెకు బదిలీ చేసిన కేసులో భాగంగా న్యాయస్థానం పైవిధంగా తీర్పునిచ్చింది. రంజనా అనెరొ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో భాగంగా కేసును పరిశీలించిన డివిజన్ బెంచ్, లింగ వివక్షను రాజ్యాంగంలో నిషేధించినట్లు తెలిపారు. కోర్టు తీర్పును పలువురు న్యాయవాదులు సమర్థించారు.

  • Loading...

More Telugu News