: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలటరీ చీఫ్ భార్య, కుమార్తె మృతి
నిన్న రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డిఫ్ భార్య, రెండేళ్ల కుమార్తె చనిపోయారని హమాస్ నేత మౌస్సా అబూ మర్జోక్ వెల్లడించారు. హమాస్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోందని అన్నారు. 2002లో మహమ్మద్ డిఫ్ హమాస్ మిలటరీ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మహమ్మద్ పై ఐదు సార్లు హత్యాయత్నం జరిగినప్పటికీ ఆయన తప్పించుకున్నారు. ఈ దాడుల్లో మరో 45 మంది మరణించారు.