: ప్రముఖ యోగా గురు అయ్యంగార్ మృతి... మోడీ సంతాపం


ప్రముఖ యోగా గురు, అయ్యంగార్ యోగా స్థాపకుడు బీకేఎన్ అయ్యంగార్ (96) కన్నుమూశారు. పూణెలోని ఆసుపత్రిలో ఈ ఉదయం ఆయన మృతి చెందారు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో గత మంగళవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. అయ్యంగార్ కు దేశీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. యోగాకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా అయ్యంగార్ రచించారు. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషన్ పురస్కారాలతో అయ్యంగార్ ను భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ ట్విట్టర్ లో సంతాపం ప్రకటించారు. అయ్యంగార్ మృతి తనను ఎంతో బాధకు గురిచేసిందని... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ ఫాలోయర్స్ కు సంతాపం తెలుపుతున్నానని మోడీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News