: స్థానికంగా లేకపోయినప్పటికీ ఎంపీ కవిత వివరాలు నమోదు


నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సమగ్ర సర్వేలో కొన్ని అంశాలు చర్చనీయాంశం కూడా అయ్యాయి. అలాంటి వాటిలో కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత వివరాల నమోదు కూడా ఒకటి. కవిత అత్తగారి ఊరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్. ఈ ఊరిలో కవిత నివాసం ఉండటం లేదు. అయినప్పటికీ, కవిత వివరాలను ఆమె అత్తమామలు నమోదు చేయించారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News