: ఏపీ తొలి బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఏపీ తొలి బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమై బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం తర్వాత... బడ్జెట్ పత్రాలను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. అనంతరం బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు.