: శ్రీకృష్ణుడిగా నటించిన రాజమౌళి!
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిలో మంచి నటుడు ఉన్నాడని అతనితో పని చేసిన హీరోలంతా చెబుతుండడం మనం విన్నాం. అలాంటి రాజమౌళి తను దర్శకుడు కాకముందే నటుడిగా అరంగేట్రం చేశాడట. ఈ విషయం స్వయంగా రాజమౌళి ఫెస్ బుక్ లో తెలిపాడు. 'చిన్నతనంలో శ్రీకృష్ణుడిగా ఓ సినిమాలో నటించాను. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ సినిమా పూర్తికాలేద'ని రాజమౌళి పోస్టు చేశాడు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమౌళి ఈ సీక్రెట్ విప్పాడు.