: కేసీఆర్ వన్నీ అబద్ధాలే!: జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే పలు అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, సర్వే ఫారంలో రేషన్ కార్డ్ కాలం తొలగించడంపై పలు సందేహాలున్నాయని అన్నారు. ఆ కాలం తొలగించడం ద్వారా కుటుంబాల కంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్ మాటలు అబద్ధమని రుజువవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సమగ్ర సర్వేను ప్రజల సౌకర్యార్థం ఆగస్టు చివరి వరకు కొనసాగించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.