: తెలంగాణ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రేపు సెలవు


తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వేలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు రేపు సెలవుదినంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు సెలవును ప్రకటించారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల సేవలను కొనియాడారు. ప్రతిఫలం ఆశించకుండా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడం ముదావహమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News