: కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా నిరాకరించిన స్పీకర్
కాంగ్రెస్ పార్టీకి అన్నీ ప్రతికూలంగా మారాయి. ఎన్నికల్లో ఘోర పరాజయంతో చావుతప్పి కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరాకరించారు. గతంలో స్పీకర్లు అనుసరించిన విధానాలు, అటార్నీ జనరల్ ముకుల్ రోహ్గతీ అభిప్రాయం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ప్రతి పక్షహోదా సాధించేందుకు కనీసం 55 మంది సభ్యులుండాలి. కాగా, కాంగ్రెస్ పార్టీకి అంత మంది సభ్యులు లేకపోవడంతో ప్రతిపక్షహోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే కార్యక్రమాలు జరుగనున్నాయి.