: సమగ్ర సర్వే ఓ ఫాల్స్ సర్వే: ఇంద్రసేనా రెడ్డి
సమగ్ర సర్వే ఓ ఫాల్స్ సర్వే అని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో సమగ్రత లోపించిందని అన్నారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో కిరాయిదారుల నమోదు తీవ్ర గందరగోళంగా ఉందని ఆయన విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో స్థానికులను లెక్కించడం లేదని ఆయన ఆరోపించారు. హైదర్ నగర్ లో సర్వే వివరాల నమోదుకు లంచం అడిగారని ఆయన తెలిపారు. పాతబస్తీలో సర్వే పుస్తకాలు నిన్నే నింపేశారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లకుండానే సర్వే వివరాలు నమోదు చేశారని ఆయన చెప్పారు. వివరాలు నమోదు కాని వారు చాలా మంది ఉన్నారని, వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.