: 700 ఏళ్ల సంప్రదాయాన్ని టీటీడీ పాటించలేదు...కోర్టుకెళ్తాం: హథిరాంజీ మఠం
కృష్ణాష్టమి వేడుకల్లో టీటీడీకి, హథిరాంజీ మఠానికి మధ్య మరోసారి గొడవ మొదలైంది. 700 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయానికి టీటీడీ మంగళం పాడిందని హథిరాంజీ మఠం ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణాష్టమి రోజున ఊరేగింపుగా వచ్చే ఉత్సవమూర్తులను మఠానికి తీసుకురావడం ఆనవాయతీ అని, దానిని పాటించకుండా టీడీపీ అధికారులు వెళ్లిపోయారని మఠం పెద్దలు మండిపడ్డారు. 700 ఏళ్లనాటి పురాతన సంప్రదాయనికి టీటీడీ అధికారులు మంగళం పలకడంపై కోర్టును ఆశ్రయిస్తామని మఠపెద్దలు హెచ్చరించారు.