: ప్రజల్ని సలహా కోరిన ప్రధాని మోడీ
ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఎలాంటి సంస్థను నెలకొల్పితే బాగుంటుందో సలహా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. అందుకోసం mygov.nic.in వెబ్ సైట్లో ప్రత్యేకంగా ఓపెన్ ఫోరమ్ క్రియేట్ చేసినట్టు తెలిపారు. 21వ శతాబ్దపు భారత దేశపు ఆకాంక్షలు తీర్చేలా ఉండాలని, అలాగే అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం ఉండేలా ఈ కొత్త సంస్థను తీర్చిదిద్దాలన్నది తమ ఆశయమని ప్రధాని స్పష్టం చేశారు.