: పాత మిత్రుడింటికెళ్లిన అమర్ సింగ్
సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ సింగ్ నేడు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఇంటికి వెళ్లారు. ఇటీవలే వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం, ఇవాళ ఇంట్లో సమావేశమవడం ఉత్తరప్రదేశ్ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. వీరిద్దరూ మళ్లీ కలిశారా? కొత్త కూటమికి ప్రాణం పోస్తున్నారా? అంటూ చర్చ మొదలైంది. కాగా, అమర్ సింగ్ మాత్రం తమ సమావేశం రాజకీయ భేటీ కాదని, కుటుంబ సంబంధమైనదని పేర్కొన్నారు. అమర్ చెబుతున్న మాటలపై అక్కడి రాజకీయ వర్గాలు ఒకింత అపనమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాయి.