: సమగ్ర సర్వేలో పాల్గొన్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో సర్వే అధికారులకు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా అందజేయడం విశేషం. నందినగర్ లో ఇల్లు, ఎర్రవల్లిలో ఫాంహౌస్ డాక్యుమెంట్ల వివరాలను కూడా సర్వేలో పొందుపరిచారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. క్యాంపు ఆఫీసు నుంచి సర్వే జరుగుతున్న తీరుతెన్నులను సమీక్షిస్తున్నారు.