: సభలో వైకాపాది అదే తీరు... గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభ పున:ప్రారంభమైన తర్వాత వైకాపా నాయకుడు జగన్ హత్యారాజకీయాలపై చర్చకు అనుమతివ్వాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్ సమాధానం చెబుతూ... ప్రతిపక్షం నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవడానికి 24 గంటల సమయమివ్వాలని... అందువలన ఈ విషయంపై రేపు చర్చిద్దామని జగన్ కు సూచించారు. అయితే ఈ సూచనకు ఒప్పుకోకుండా... వైకాపా సభ్యులు 'వియ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేస్తుండడంతో... స్పీకర్ సభను రేపు ఉదయం 10 గంటలకి వాయిదా వేశారు.