: టీమిండియా ఘోర ఓటమితో మేల్కొన్న బీసీసీఐ... క్రికెట్ టీం డైరెక్టర్ గా రవిశాస్త్రి


ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఘోర ఓటమితో బీసీసీఐ నిద్రలేచింది. ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ లో ఇండియన్ క్రికెట్ టీంకు డైరెక్టర్ గా రవిశాస్త్రిని బీసీసీఐ నియమించింది. రవిశాస్త్రికి సహాయకులుగా సంజయ్ బంగర్, భరత్ అరుణ్, శ్రీధర్ లను నియమించింది. సంజయ్ బంగర్, భరత్ అరుణ్ లు వన్డే సిరీస్ లో సహాయ కోచ్ లుగా వ్యవహరించనున్నారు. అలాగే, ఆర్.శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం పనిచేస్తోన్న టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు బీసీసీఐ తాత్కాలికంగా విశ్రాంతినిచ్చింది.

  • Loading...

More Telugu News