: సాగు దిగుబడి పెంచేందుకు ఇక్రిశాట్ తో ఒప్పందం: మంత్రి పుల్లారావు


వ్యవసాయంలో తక్కువ పెట్టుబడులతోనే అధిక దిగుబడులు సాధించేందుకు ఇక్రిశాట్ తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. 30 శాతం పెట్టుబడి తగ్గిస్తూ 10 శాతం మేర దిగుబడి పెంచేలా ఇక్రిశాట్ ప్రణాళికలు రూపొందించిందని మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులకు చెప్పారు. సాగుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న మంత్రి, సాగు బడ్జెట్ ను రూ. 10 నుంచి 20 వేల కోట్ల మేర నిధులతో రూపకల్పన చేసేందుకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News