: సర్వేలో అప్పులకు సంబంధించిన కాలమ్ ఏదీ?: ఎన్యూమరేటర్లను ప్రశ్నించిన కార్మికులు
సమగ్ర కుటుంబ సర్వేకు కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సిరిసిల్లలో చేనేత కార్మికుల కుటుంబాలను సర్వే చేయడానికి వెళ్లినప్పుడు ఎన్యూమరేటర్లను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. సర్వేలో అప్పులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడానికి కాలమ్ ను ఎందుకు పెట్టలేదని కార్మికులు ఎన్యూమరేటర్లను ప్రశ్నించారు. సర్వే పత్రంలో ఆస్తుల గురించి అడుగుతున్నప్పుడు... అప్పుల గురించి మాత్రం ఎందుకు అడగటం లేదని వారు అధికారులను నిలదీశారు. ఇంకోవైపు వరంగల్ నగరంలో ఇంటి నెంబర్లు దొరకక ఎన్యూమరేటర్లు కాళ్లరిగేలా ఇంకా రోడ్లపైనే తిరుగుతున్నారు.