: గుంటూరులో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్


గుంటూరు నగరంలోని ఎన్జీఓ కాలనీలో మంగళవారం కిడ్నాప్ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ఐదేళ్ల బాలుడు జాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన దుండగులు రూ.5 లక్షలిస్తేనే జాన్ ను వదిలిపెడతామని బెదిరించారు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News