: హత్యారాజకీయాలపై చర్చకు... స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్న వైసీపీ
రాష్ట్రంలోని హత్యా రాజకీయాలపై శాసనసభ తొలి రోజు సమావేశాల్లో గొడవ చేసి... సభను వాయిదా పడేలా చేసిన వైసీపీ రెండో రోజు సమావేశాల్లో తన వ్యూహాన్ని మార్చుకుంది. హత్యా రాజకీయాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు నోటీసు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది. వైసీపీ నోటీసులు అందిన తర్వాత హత్యారాజకీయాలపై చర్చకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.