: ప్రైవేటు బస్సుల వ్యాపారం నష్టాల్లో నడుస్తోంది... అందుకే 88 బస్సులు అమ్మేశాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
ప్రైవేటు బస్సుల వ్యాపారం ఏమాత్రం లాభసాటిగా లేదని... దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. డీజిల్ ధరలు బాగా పెరగడంతో... గొప్ప ట్రావెల్స్ గా పేరొందిన సంస్థలన్నీ...కొన్నాళ్లుగా భారీ నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా, తాము అంతర్ రాష్ట్రాలలో తిరిగే 38 బస్సులను మినహా... మిగతా బస్సులను అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే తమ సంస్థ దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 88 బస్సులను పర్మిట్లతో అమ్మేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.