: మోడీ 'మంత్ర'కు వెల్లువెత్తుతున్న నిధుల వరద!


'స్వచ్ఛ్ భారత్' పేరిట ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు నిధుల వరద ముంచెత్తుతోంది. సర్కారీ విద్యాలయాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలన్న మోడీ పిలుపునకు సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 100 కోట్లను ప్రకటించిన మరుక్షణమే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా తన వితరణను చాటుకుంది. భారతి ఎయిర్ టెల్ నేతృత్వంలోని భారతి ఫౌండేషన్ రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక, సునీల్ భారతి మిట్టల్ సొంత జిల్లా లుధియానాను దత్తత తీసుకోనున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ చేసిన ప్రకటనకు తొలుత రూ. 2 కోట్ల విరాళాన్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం స్వచ్ఛ భారత్ కు రూ. 100 కోట్లను ప్రకటించిన టీసీఎస్ దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. టీసీఎస్ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో భారతి ఫౌండేషన్ భారీ విరాళాన్ని ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News