: ఈ సైకో మామూలోడు కాదండోయ్!


ఘరానా మోసగాడైన సైకోను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీఐపీ మహిళల్ని టార్గెట్ చేస్తూ 108 మంది స్త్రీలను రకరకాలుగా మోసం చేసిన లక్ష్మీనాయుడు అనే కరడుకట్టిన మోసగాడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. పాలకొండకు చెందిన ఈ మోసగాడు 8 మందిని వలలో వేసుకుని వివాహేతర సంబంధం కూడా నెరపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. అతను రెండు హత్యకేసుల్లో నిందితుడని, చైన్ స్నాచింగ్ సహా అతనిపై మరిన్ని కేసులు ఉన్నాయని విశాఖ పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, విచారణ సందర్భంగా అతను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, సైకో లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News