: ఎమ్మెల్సీగా కర్నే ప్రభాకర్


టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్‌ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. గత నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభాకర్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఎన్నికల్లో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే, అక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని నిలిపి కేసీఆర్ ప్రభాకర్ కు షాకిచ్చారు. అయినప్పటికీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీతోనే కర్నె కొనసాగారు. దీంతో కేసీఆర్ ఆయనకు నజరానాగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.

  • Loading...

More Telugu News