: పాక్ కు షాకిచ్చిన భారత్


పాకిస్థాన్ కు భారత్ షాకిచ్చింది. చర్చలు జరుపుదాం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొందాం అంటూ చిలుకపలుకులు పలుకుతూనే... కాశ్మీర్ లోని వేర్పాటు వాదులతో చర్చలు అంటూ రెచ్చగొట్టడంతో పాక్ పన్నాగాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆగస్టు 25న పాక్ తో జరుగనున్న చర్చలు రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. భారత్ అంతరంగిక వ్యవహారాల్లో పదేపదే జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ విదేశాంగ శాఖకు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం, చర్చల పట్ల పాక్ వైఖరి అనుమానాలు రేపేదిగా ఉందని పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కు భారత విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు. పాక్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే చర్చలకు అభ్యంతరం లేదని, చర్చలు అర్థవంతంగా, సానుకూలమైన వాతావరణంలో జరగాలని ఆయన పాక్ కు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News