: సమగ్ర సర్వేకు కర్ఫ్యూ కోసం మించిన షరతులా?: బీజేపీ నేతలు
తెలంగాణలో నిర్వహించనున్న సమగ్ర సర్వే కోసం కర్ఫ్యూను మించిన షరతులు అమలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పంతానికి పోయి ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని సూచించారు. ఇంటర్ విద్యార్థులతో సమగ్ర సర్వే చేయించడమేమిటని ఆయన ప్రశ్నించారు. వారితో సర్వే చేయిస్తే ప్రభుత్వం అనుకున్న ఫలితాలు వస్తాయా? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం ప్రజల అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని ఆయన ఆక్షేపించారు. అత్యవసర సర్వీసుల నిలుపుదలపై పునరాలోచించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.