: సమగ్ర సర్వేకొచ్చిన ఉద్యోగులను కొట్టిన యువకుడు
సమగ్ర సర్వే కోసం వచ్చిన ఉద్యోగులపై ఓ యువకుడు దాడికి దిగాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో తాగిన మైకంలో ఓ యువకుడు సమగ్ర సర్వేకి వచ్చిన ఉద్యోగులపై దాడి చేశాడు. అతను కొట్టిన దెబ్బలకు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సమగ్ర సర్వే కోసం వచ్చిన వారిపై ఎవరైనా దాడులకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.