: ఇక నూకలు చెల్లిపోయాయని అనుకున్నా: ఛార్మి


సినీ నటి ఛార్మి జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుందని ట్విట్టర్లో తెలిపింది. ఈ క్షణం ఇలా అభిమానుల ముందు ఉన్నానంటే అంతా దేవుడి దయే అని తెలిపింది. వివరాల్లోకి వెళితే... ఛార్మి ఈ రోజు ఇండిగో విమానంలో వైజాగ్ వెళ్లింది. వైజాగ్ లో ల్యాండ్ అవడానికి ముందు ఒక్కసారిగా విమానం 100 అడుగులు కిందకి జారిపోయింది. వస్తువులు అన్నీ కింద పడిపోయాయి. దీంతో విమానంలో ఉన్నవారందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. చనిపోయామనే అనుకున్నారు. ఈలోపు ఫ్లైట్ సర్దుకుంది... హమ్మయ్య బతికాం అని అంతా అనుకునే లోపే విమానం మరోసారి కిందికి జారిపోయింది. ఇక ఇవే చివరి క్షణాలని, బతికి బట్టకట్టడం కల్ల అని అనుకున్నానని ఛార్మి తెలిపింది. పైలట్ విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయడంతో బతుకు జీవుడా అంటూ విమానం నుంచి బయటపడ్డారట. ఈ విషయం ఛార్మీ ట్విట్ చేసింది. జీవితంలో ఇలాంటి క్షణాలను ఎవరూ అనుభవించకూడదని, ఈ చేదు జ్ఞాపకం నుంచి నెమ్మదిగా బయటపడుతున్నానని ఛార్మి వెల్లడించింది.

  • Loading...

More Telugu News