: ఒకటే పరికరం... పరీక్షలు మూడు!


మధుమేహం వస్తే నెలకోసారైనా పరీక్షలు చేయించుకోవాలి... దానికి ల్యాబ్ టెక్నీషియన్ బాగానే వసూలు చేస్తాడు. ఇక మలేరియా వచ్చిందేమోనన్న అనుమానం వస్తే... వామ్మో డాక్టర్ కన్షల్టేషన్ ఫీజు, పరీక్షల ఫీజులు భారీగానే గుంజుతారు. నీటి కాలుష్యం తెలుసుకోవడం ఎలా? అదెలాగో మనకి తెలియదే. ఈ మూడు పరీక్షలకు ఒకే మిషన్ అందుబాటు ధరలో దొరికితే? వాహ్, ఆలోచన బాగుంది కదా! అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రకమైన పరికరాన్ని తయారు చేశారు. దీని ధర సుమారు 1500 రూపాయలు ఉంటుంది. 100 గ్రాముల బరువుండే ఈ పరికరాన్ని రక్తంలో షుగర్ స్థాయి కొలిచే పరికరం ఆధారంగా రూపకల్పన చేశారు. దీనిలో రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి పరీక్షల ఆప్షన్స్ బటన్ కాగా, రెండోది పరీక్ష కావాలో, వద్దో తెలిపే బటన్. ఇది షుగర్ లెవెల్ టెస్ట్, మలేరియా టెస్ట్, నీటి కాలుష్యం లెవెల్ టెస్ట్ చేస్తుందని వారు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మందికి జ్వరం భయం పోతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News