: అమెరికాలో తీవ్రమవుతున్న జాతివివక్ష పోరాటం


మనదేశంలో కులవివక్ష ఉన్నట్టే, అమెరికాలో వర్ణవివక్ష ఉంది. అత్యాధునిక నాగరికులమని విర్రవీగే అమెరికాలో జాతి వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. సెయింట్ లూయిస్ మిస్సోరి రాష్ట్రంలోని ఫెర్గూసన్ లో అమెరికా పోలీసు ఓ నల్లజాతీయుడైన దొంగను పట్టుకున్నారు. తరువాత అతనిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండా కాల్చి చంపారు. ఈ వ్యవహారం జాతివివక్ష రంగు పులుముకుంది. దీంతో నల్లజాతీయులంతా రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కర్ఫ్యూ విధించారు. ఏడుగురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News