: బీజేపీ చేతకాని తనానికి నిదర్శనం ఆ సమావేశం: కాంగ్రెస్


భారతదేశంలో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద వర్గాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ సమావేశాన్ని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కాగా, వీరి భేటీ జరుగనున్న రోజు ఈ నెల 25న పాక్, భారత్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం జరుగనుంది. దానిని సానుకూల వాతావరణంలో జరుగకుండా అడ్డుకునేందుకు పాక్ కుతంత్రానికి తెరతీసింది. వేర్పాటువాదులతో సమావేశమవుతూనే మరోపక్క భారత ప్రభుత్వాధికారులతో ఎలా సమావేశమవుతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిన్నర తరువాత తొలిసారి జరుగుతున్న సమావేశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాక్ ఎత్తుగడలు వేస్తోంది. చర్చలకు సిద్ధమని చెబుతూనే భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యలు చేపడుతోంది. అబ్దుల్ బాసిత్ తో కాశ్మీర్ వేర్పాటువాద నేతలు ఉమర్ ఫరూఖ్, సయ్యద్ అలీషా (హురియత్ కాన్ఫరెన్స్), యాసిన్ మాలిక్ (జేకేఎల్ఎఫ్), మరో సీనియర్ వేర్పాటు వేద నేత షాబీర్ అహ్మద్ లు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News