: మోహన్ భగవత్ వ్యాఖ్యలను మోడీ బలపర్చరు: బీజేపీ ఎమ్మెల్యే
'భారతదేశం హిందూ దేశం' అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను గోవా బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదించరని ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతమాత్రమూ అలాంటి మాటలను అంగీకరించరన్నారు. కాగా వ్యక్తిగతంగా క్రిస్టియన్ అయిన లోబో... భగవత్ వ్యాఖ్యలను ఖండించడం తన వ్యక్తిగత నిర్ణయమన్నారు.