: మోడీ ప్రకటించిన పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం: దత్తాత్రేయ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన అభివృద్ధి పథకాలపై పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. పథకాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తామని హైదరాబాదులో మీడియాకు తెలిపారు. అంతేగాక పథకాలు ఎలా అమలవుతున్నాయో ఓ నివేదిక రూపొందించి ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సమగ్ర సర్వేపై మాట్లాడిన ఆయన, ప్రజల నుంచి సేకరించిన సమాచారం బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగించకూడదని అన్నారు.