: సర్వేలో అందరూ పాల్గొనాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్
ఈ నెల 19వ తేదీన (మంగళవారం) తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ పాల్గొనాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అన్నారు. ఎక్కడ నివాసం ఉన్న వారు అక్కడే నమోదు చేసుకోవాలన్న ఆయన భవిష్యత్తులో అవసరమైతే సర్వే వివరాలను మార్పు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సర్వేలో అన్ని వివరాలు ఇస్తే మంచిదని కమిషనర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... మీడియా, అత్యవసర సేవల్లో ఉన్నవారు ఆఫీసు నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పారు. చెక్ లిస్టులు హైదరాబాదులో తప్ప మరెక్కడా ఇవ్వలేదన్నారు. ఫిర్యాదులేమైనా ఉంటే ఇ-మెయిల్, కాల్ సెంటర్ నెంబర్ లో సంప్రదించాలని ఆయన సూచించారు.