: తన ప్రాణాలు పణంగా పెట్టి పిల్లాడిని కాపాడింది
కొన్ని సంఘటనలు చూస్తే, కుక్కలకు, మనుషులకు మధ్య ఏదో బంధం వుందనిపిస్తుంది. అందుకేనేమో కుక్కలు అంతులేని విశ్వాసం కనబరుస్తాయి. ఇటలీలోని ఆండ్రియాటికి తీర ప్రాంతంలోని మార్షి దగ్గర బెనడెలోడెల్ ట్రోరంటో వద్ద సముద్రంలో కళ్లెదుట మునిగిపోతున్న ఐదేళ్ల బాలుడిని చూసిన బారెల్లో అనె మెస్టిజో కుక్క వెంటనే ముందుకు ఉరికింది. నీళ్లలో దూకి తన శాయశక్తులా ప్రయత్నించి బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. విచారించదగ్గ విషయం ఏమిటంటే, బాలుడిని రక్షించే క్రమంలో బారెల్లో నీట మునిగి తనువు చాలించింది.