: ‘సమగ్ర సర్వే’ కోసం 3.70 లక్షల మంది ఉద్యోగులు సన్నద్ధం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు (మంగళవారం) జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ సర్వే కోసం 3 లక్షల 70 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదు (జీహెచ్ఎంసీ) పరిధిలో 20 లక్షల కుటుంబాల సర్వేలో 75 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 7.89 లక్షల కుటుంబాల సర్వేలో 28 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. * ఆదిలాబాదులో 7.47 లక్షల కుటుంబాల సర్వేలో 30 వేల మంది ఉద్యోగులు * మెదక్ జిల్లాలో 7.56 లక్షల కుటుంబాల సర్వేలో 30 వేల మంది ఉద్యోగులు * నల్గొండలో 10.42 లక్షల కుటుంబాల సర్వేలో 35 వేల మంది ఉద్యోగులు * ఖమ్మంలో 8.77 లక్షల కుటుంబాల సర్వేలో 29 వేల మంది ఉద్యోగులు * నిజామాబాదులో 7.5 లక్షల కుటుంబాల సర్వేలో 28 వేల మంది ఉద్యోగులు * కరీంనగర్ లో 9.86 లక్షల కుటుంబాల సర్వేలో 34 వేల మంది ఉద్యోగులు * వరంగల్ లో 10.15 లక్షల కుటుంబాల సర్వేలో 43 వేల మంది ఉద్యోగులు * మహబూబ్ నగర్ లో 9.74 లక్షల కుటుంబాల సర్వేలో 39 వేల మంది ఉద్యోగులు