: మహేలకు సూపర్ సెండాఫ్!
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే టెస్టు కెరీర్ కు అద్భుతరీతిలో ముగింపు లభించింది. కెరీర్ చివరి టెస్టు, చివరి సిరీస్ లో విజయాన్నందుకోవడం ఏ క్రికెటర్ కైనా మరపురాని ఘట్టమే. అదిప్పుడు మహేల జయవర్ధనే కెరీర్లో సాకారమైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో పాకిస్థాన్ తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్ 2-0తో ఆతిథ్యజట్టు వశమైంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందే మహేల టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. పాక్ తో సిరీసే ఆఖరిదని తెలిపాడు. లంక క్రికెట్ కు దశాబ్దాల తరబడి అలుపెరుగని సేవలందించిన ఈ వెటరన్ ఆటగాడికి మాథ్యూస్ సేన అపూర్వ విజయాన్ని కానుకగా అందించింది. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ఇకపై వన్డేల్లోనే ఆడతాడు. టి20 వరల్డ్ కప్ టోర్నీ నెగ్గిన అనంతరం ఆ మినీ ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పడం తెలిసిందే. కాగా, మహేల 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశాలున్నాయి.