: సొంతూరికి పయనమైన తెలంగాణ ప్రజలు
వృత్తి, ఉద్యోగాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సొంత ఊరికి పయనమయ్యారు. మంగళవారం నాడు జరిగే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనే నిమిత్తం సకుటుంబ సమేతంగా వారు స్వస్థలాలకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బయల్దేరే కుటుంబాలతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పలు జిల్లాల ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.