: నేను రొమాంటిక్ సినిమాలు తీస్తే ఫలితం 'చెన్నై ఎక్స్ ప్రెస్' లానే ఉంటుంది: రోహిత్ శెట్టి


'సింగం రిటర్న్స్'తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ స్టార్ డైరక్టర్ రోహిత్ శెట్టి తనకు యాక్షన్ సినిమా మేకింగ్ అంటేనే ఇష్టమంటున్నాడు. వాటితో ప్రేక్షకులను మెప్పించవచ్చని, పెట్టిన డబ్బు కూడా తిరిగి వస్తుందని అభిప్రాయపడ్డాడు. తాను ప్రేమకథలతో సినిమాలు తెరకెక్కిస్తే ఫలితం 'చెన్నె ఎక్స్ ప్రెస్' లానే ఉంటుందన్నాడు. యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన శెట్టి ఓ ప్రశ్నకు జవాబిస్తూ, ప్రేక్షకులను తాను మోసం చేయలేనని, తాను వారికోసమే సినిమాలు తీస్తానని చెప్పుకొచ్చాడు. "నాతో సినిమా తీసిన వారికి ఇళ్ళమ్ముకోవాల్సిన గతి పట్టించలేను" అని వ్యాఖ్యానించాడు. మునుపటి రోజుల్లో సినిమా బాగా ఆడిన పక్షంలో పెట్టిన డబ్బులు పోయినా పట్టించుకునేవారు కాదని తెలిపాడు.

  • Loading...

More Telugu News