: శారదా స్కాం కేసులో నటి అపర్ణా సేన్ ను ప్రశ్నించిన ఈడీ
సంచలనం రేపిన రూ. పది వేల కోట్ల శారదా చిట్ ఫండ్ స్కాం కేసులో దర్యాప్తు, విచారణ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఈరోజు నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోల్ కతాలో ప్రశ్నించింది. శారదా గ్రూప్ ఆధ్వర్యంలో నడుపుతున్న 'పరోమా' మ్యాగజైన్ కు ఆమె సంపాదకురాలుగా వ్యవహరిస్తున్నారు. అటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలోని టెక్స్ టైల్ మంత్రిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సీబీఐ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నా సంగతి తెలిసిందే.